: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఎంఐఎం నేతపై నిర్భయ కేసు
పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ అనంతపురం జిల్లా కదిరి స్థానిక ఎంఐఎం నేత ఇలియాజ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. 376, 506, 109 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు స్థానికంగా అతనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.