: శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటి తనూజ
బాలీవుడ్ సీనియర్ నటి తనూజ (70) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా కోల్ కతాలోని బెల్లె వ్యూ క్లినిక్ లో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆక్సిజన్ పెట్టి అబ్జర్వేషన్ లో ఉంచినట్టు ఆసుపత్రి సీఈవో పి.టాండన్ తెలిపారు. కోల్ కతాలో నిన్న (సోమవారం) సాయంత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఆ సమయంలోనే తనూజ అకస్మాత్తుగా శ్వాస సమస్యతో బాధపడ్డారు. హిందీ కథానాయిక కాజోల్ తల్లే తనూజ!