: ఇక్కడున్న ఆంధ్ర, రాయలసీమ వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతాయా? లేదా?: అక్బరుద్దీన్
ఇవాళ శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రభుత్వానికి కీలక ప్రశ్న సంధించారు. తెలంగాణలో ఆంధ్ర, రాయలసీమ, ఇతర ప్రాంతాలకు చెందిన వారు అనేక మంది ఉన్నారని... వాళ్ల తాతలో, తండ్రులో, లేక పిల్లలో ఇక్కడే పుట్టారని... వాళ్లందరికీ ప్రభుత్వ పథకాలు, స్కాలర్ షిప్ లు అందుతాయా? లేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు స్పష్టమైన సమాధానం కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఇతర ప్రాంతాల వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తే, చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. సర్వే వివరాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరచాలని అన్నారు.