: గతంలో జారీ చేసిన రేషన్ కార్డులన్నీ సక్రమమైనవే: చిన్నారెడ్డి
పింఛన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఆమోదయోగ్యం కాదని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, సర్వే కోసం సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చారని... వారంతా సర్వేలో పాల్గొన్నారని చెప్పారు. ఇప్పుడు పింఛన్ల కోసం మళ్లీ సర్వే ఎందుకు చేయించారని నిలదీశారు. రకరకాల సర్వేలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. పింఛన్ దారుల నమోదులో చాలా తప్పులు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. గతంలో జారీ చేసిన రేషన్ కార్డులన్నీ సక్రమమైనవే అని తెలిపారు.