: ఇక ఆధార్ ఉంటేనే... పాస్ పోర్టు!


పాస్ పోర్టు కావాలా? అయితే మీకు ఆధార్ ఉండాల్సిందే. ఆధార్ కార్డు తీసుకోలేదా? అయితే తక్షణమే తీసుకోండి. కనీసం ఆధార్ ఎన్ రోల్ మెంట్ నెంబరైనా తప్పనిసరిగా ఉండాల్సిందే. అదేంటీ, ప్రతిదానికి ఆధార్ లింకు పెడుతున్నారని కోపగించుకుంటున్నారా? అయితే కేంద్రం తీసుకుంటున్న ఈ మంచి చర్యను మీరు అపార్థం చేసుకున్నట్లే లెక్క. ఎందుకంటే మనకు త్వరితగతిన పాస్ పోర్టు అందించాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కారు పాస్ పోర్టుకు ఆధార్ నెంబరును కచ్చితం చేయనుంది. ప్రస్తుతం పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే, కనీసం నెల రోజులైనా వేచి చూడాల్సి వస్తోంది. మన వ్యక్తిగత వివరాలతో పాటు మనపై ఏవైనా నేర చరిత్ర కలిగిన రికార్డులున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఆ పని చేసేలోగా పుణ్యకాలం కాస్తా ముగుస్తోంది. దీంతో కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాప్యానికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కారు, పాస్ పోర్టుల జారీకి ఆధార్ ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ నేర రికార్డుల సంస్థ రూపొందించే డేటా బేస్ లో నేరాల చిట్టా అందుబాటులో ఉంటుంది. పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న సమయంలో మన ఆధార్ కార్డును జత చేస్తే సరి, మన చరిత్ర ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అర్హులైన దరఖాస్తు దారులకు క్షణాల్లో పాస్ పోర్టు లభించనుంది.

  • Loading...

More Telugu News