: ప్రధాని విదేశీ పర్యటన నేటి నుంచి ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ పది రోజుల పాటు జరపనున్న విదేశీ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. తూర్పు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ను మరింత పటిష్టం చేసేందుకే ప్రధాని ఈ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజిల్లో మోదీ పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్ లో జరిగే జీ-20 సదస్సులో పాల్గొననున్న మోదీ నల్లధనంపై అంతర్జాతీయ సహకారం ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. జీ-20 తో పాటు ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొననున్న మోదీ ఆయా దేశాలకు చెందిన పలు దేశాల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అవుతారు.