: ఏపీలో ఇసుక విక్రయాల కోసం ప్రత్యేక వెబ్ సైట్


ఏపీలో ఇసుక విక్రయాలను ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. వినియోగదారులు ఇసుక విక్రేతల వద్దకు వెళ్లనవసరం లేకుండా, ఆన్ లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. అందుకోసం సర్కారు ప్రత్యేకంగా www.sandbyshg.ap.gov.in పేరిట ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్ సైట్లో బుక్ చేసుకుంటే ఇసుక ఇంటివద్దకే వస్తుంది. ఇసుక విక్రయంపై సలహాలు, సూచనల కోసం sandminingbyshg ఫేస్ బుక్ పేజీని దర్శించవచ్చని ఏపీ సీఎంవో పేర్కొంది. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 20201211800 ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ద్వారా 1.55 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News