: రూ. 2572 కోట్లు విద్యుత్ కొనుగోలుకు ఖర్చుపెట్టాం: కేసీఆర్
ఇప్పటిదాకా విద్యుత్ కొనుగోలు కోసం రూ. 2572 కోట్లు ఖర్చు పెట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో వెల్లడించారు. కృష్ణపట్నంలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని... ఈ ప్లాంట్ విద్యుత్ ను ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ చేయడం లేదని తెలిపారు. నాగార్జున సాగర్ లో 510 అడుగుల కంటే తక్కువగా నీరు ఉన్నప్పుడు వాడుకోరాదని హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. ఏపీలో కూడా కరెంట్ కొరత ఉందని... వారు కూడా కరెంట్ కొంటున్నారని కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాలు కలసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలని... భేషజాలకు పోకుండా సహకరించుకుందామని అసెంబ్లీ సాక్షిగా పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలోకి వెళ్లిన ఏడు మండలాలకు తెలంగాణ విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.