: కార్మిక శాఖ మంత్రిగా దత్తాత్రేయ బాధ్యతల స్వీకరణ
కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా బండారు దత్తాత్రేయ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి ఎంపీగా ఎన్నికయిన ఆయనకు కేంద్ర కేబినెట్ తొలి విస్తరణలో తెలంగాణ నుంచి చోటు దక్కింది.