: భవిష్యత్తులో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తప్పదేమో!: అశోక్ గజపతి రాజు
ఇప్పటికిప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ లేకపోయినా, భవిష్యత్తులో ఈ దిశగా అడుగులు పడవని చెప్పలేమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. దేశంలోని పలు వర్గాల నుంచి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం సలహాలు అందుతున్నాయని ఆయన సోమవారం పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా భవిష్యత్తును నిర్ణయించేందుకు ఓ నిపుణుల కమిటీని నియమించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెలికాప్టర్ల కంపెనీ పవన్ హన్స్ ఆర్థిక వ్యవహారాల్లో మరింత పారదర్శకత కోసం వాటిని స్టాక్ ఎక్చేంజీల్లో నమోదు చేయనున్నామని ఆయన తెలిపారు.