: ఇండియా పేరు మార్పు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం
ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ విషయంపై ముందుగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ కు సూచించింది. అధికార యంత్రాంగం సదరు పిటిషన్ పై స్పందించిన తర్వాత కాని దానిని విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.