: 2015 నాటికి 20 బిలియన్ డాలర్ల మార్కెట్ గా దేశీయ ఈ-కామర్స్!
దేశీయ ఈ-మార్కెట్ రంగం 20 బిలియన్ డాలర్ల మార్కెట్ గా అవతరించనుంది. దేశంలో ఈ-కామర్స్ బాట పడుతున్న నెటిజన్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో 37 శాతం వృద్ధి నమోదు కానుందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఈ-కామర్స్ సంస్థల మార్కెట్ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంది. నెటిజన్ల సంఖ్య పెరగడంతో పాటు ఆన్ లైన్ లోనే తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ముందుకు వస్తున్న తయారీదారులు కూడా ఈ వృద్ధికి దోహదం చేస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది. 2013 నుంచి 2016 వరకు ఈ-టెయిలింగ్ లో 60 శాతం వృద్ధి నమోదు కానుందని కూడా ఓస్వాల్ నివేదిక వెల్లడించింది.