: మేనల్లుడిని చంపిందంటూ... మహిళను వివస్త్రను చేసి గాడిదపై ఊరేగించారు!


రాజస్థాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల మహిళను వివస్త్రను చేసిన గ్రామస్తులు దాదాపు గంట పాటు గాడిదపై కూర్చోబెట్టి ఊరేగించారు. ఈ దారుణంలో బాధితురాలి తరఫు బంధువులు కూడా తమ వంతు కీలక పాత్ర పోషించారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, 30 మందిని అరెస్ట్ చేయగా, వారిలో బాధితురాలి బంధువులే తొమ్మది ఉండటం విశేషం. జిల్లాలోని తుర్వాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తన భర్తను అతడి మేనత్త అంతమొందించి ఉంటుందని, మృతుడి భార్య పంచాయతీ పెద్దలకు చెప్పింది. దీంతో బాధితురాలిని పిలిచిన గ్రామస్తులు ఆమె ముఖానికి బొగ్గు రాసి, వివస్త్రను చేసి, గాడిదపై కూర్చోబెట్టి గంట పాటు గ్రామం మొత్తం తిప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్వేతా ధంకర్ చెప్పారు.

  • Loading...

More Telugu News