: ఏపీ సీఎం పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నావ్?... సభలో కేసీఆర్ ను నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరెంటు సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును తీసుకొచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన టీటీడీపీ ఎమ్మెల్యేలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఈ సభలో ఎందుకు ప్రస్తావిస్తున్నావంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రవర్తనను తప్పుబడుతూ నినాదాలు చేశారు. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ, స్పీకర్ అనుమతితోనే చంద్రబాబు పేరును ప్రస్తావించానని... సభా నియమాలను తాను ఉల్లంఘించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.