: కృష్ణా నీటి కేటాయింపులపై సుప్రీంలో తెలంగాణ పిటిషన్
కృష్ణా నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై స్టే విధించి, నీటి కేటాయింపులు మళ్లీ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం 'నాట్ బి ఫోర్ మి' అంటూ వ్యాఖ్యానించి, పిటిషన్ పై విచారించేందుకు నిరాకరించింది. దాంతో, పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయిన తరువాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.