: శ్రీలంకలో మరణశిక్ష పడిన తమిళ జాలర్లకు పెద్ద ఊరట
శ్రీలంకలోని కొలంబో కోర్టు మరణశిక్ష విధించిన తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు పెద్ద ఊరట లభించింది. ఈ క్రమంలో దోషులను భారతదేశంలోని జైలుకు తరలించాలని లంక ప్రభుత్వం నిర్ణయించినట్టు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లంక అధ్యక్షుడు మహిందా రాజపక్సతో మాట్లాడటం వల్లనే ఇది సాధ్యమైందని స్వామి ట్వీట్ చేశారు. "నమో, రాజపక్స నిన్న ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ మేరకు ఐదుగురు జాలర్లను భారత జైలుకు బదిలీ చేసేందుకు, ఇందుకు సంబంధించిన ఒప్పందానికి అంగీకరించారు" అని ట్విట్టర్లో తెలిపారు.