: నెలాఖరులోగా రుణమాఫీ పూర్తి: పోచారం


రైతు రుణాల మాఫీ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన పోచారం, నెలాఖరులోగా రుణమాఫీ ఫలితాలు రైతులకు అందుతాయన్నారు. 7 శాతం వడ్డీతో రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. 14 శాతం వడ్డీపై బంగారాన్ని కుదువబెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదని ఆయన వెల్లడించారు. ఖరీఫ్ లో బ్యాంకులు జారీ చేసిన రూ.8,100 కోట్ల రుణాల్లోనూ రూ.1,500 కోట్ల మేర బంగారంపై తీసుకున్న రుణాలే ఉన్నాయని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News