: ‘సోషల్ నెట్ వర్క్’ చిత్రంపై జెకెర్ బర్గ్ అసంతృప్తి!


ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ సోషల్ నెట్ వర్క్ పై అసహనం వ్యక్తం చేశారు. అదేంటీ, ప్రపంచాన్నే సోషల్ నెట్ వర్క్ బాట పట్టించిన జుకెర్ బర్గ్, తాను రూపొందించిన దానిపైనే అసంతృప్తి వ్యక్తం చేయడమా? అదేం కాదు గాని, తన ప్రస్థానాన్ని ఆధారం చేసుకుని రూపొందిన చిత్రం ‘సోషల్ నెట్ వర్క్’లో నిర్మాతలు తామనుకున్నట్లు కల్పిత కథనాలు అల్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సదరు చిత్రంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా జుకెర్ బర్గ్ ఈ మేరకు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రపంచంలోనే పెను విప్లవానికి దారి తీసిన తన ఆవిష్కరణకు సవరణలు చేస్తే, ఎవరికైనా కోపం వస్తుందిగా. మరి జుకెర్ బర్గ్ అసంతృప్తిలో ఏమాత్రం తప్పు లేదన్నది విశ్లేషకుల వాదన.

  • Loading...

More Telugu News