: దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది: సుజనా చౌదరి


కేంద్ర మంత్రి పదవి రూపంలో దేశానికి సేవ చేసే అవకాశం తనకు అందివచ్చిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆదివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో సుజనా చౌదరికి సహాయ మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక రంగంలో ఉన్న తాను చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పదవికి తన పేరును సిఫారసు చేసిన చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబులను ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవ చేస్తానని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు రెండింటినీ అబివృద్ది పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News