: రేపే కేంద్ర కేబినెట్ భేటీ!
తొలి విస్తరణతో సభ్యుల సంఖ్యను 66కు పెంచుకున్న కేంద్ర కేబినెట్ సోమవారం సాయంత్రం భేటీ కానుంది. ఆదివారం నాటి విస్తరణలో కేబినెట్ హోదా కలిగిన నలుగురు మంత్రులు ప్రమాణం చేశారు. అయితే స్వతంత్ర హోదాలో ముగ్గురు సహాయ మంత్రులు, మరో 14 మంది సహాయ మంత్రులు కేబినెట్ లో చేరిన నేపథ్యంలో సోమవారం నాటి భేటీకి కేబినెట్ మంత్రులు సహా, సహాయ మంత్రులు కూడా హాజరుకానున్నారు.