: ఒలింపిక్ పతక విజేతకు మోదీ కేబినెట్ లో బెర్తు!
ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు మోదీ కేబినెట్ లో బెర్తు ఖరారైంది. కొద్దిసేపట్లో ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిలిటరీ అధికారిగా దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటూనే షూటింగ్ లో ప్రతిభ చాటిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్ కు పతకాన్ని అందించారు. షూటింగ్ లో మెరుగైన ప్రతిభ కనబరచిన రాథోడ్ ను భారత ప్రభుత్వం అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో పాటు పద్మశ్రీ తో సత్కరించింది. తాజాగా రాజకీయ రంగంలో అడుగిడిన ఆయన బీజేపీ తరఫున రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. తొలిసారి పార్లమెంట్ లో అడుగిడిన రాథోడ్, ఐదు నెలలు తిరగకముందే కేంద్ర మంత్రి హోదాను చేజిక్కించుకున్నారు.