: సచిన్ ను విమర్శిస్తే తనయుడికి కోపం రాదా మరి!


తల్లిదండ్రులను ఎవరైనా విమర్శిస్తే చిన్నపిల్లలు భరించలేరు. క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కూడా అందుకు మినహాయింపు కాదు. 2007లో వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ లో టీమిండియా దారుణ పరాభవం చవిచూసింది. కనీసం గ్రూప్ దశను కూడా అధిగమించలేక తీవ్రంగా నిరాశపరిచింది. అప్పుడు అర్జున్ వయసు ఏడేళ్లు. ఓ రోజు స్కూల్లో ఓ పిల్లవాడు సచిన్ డకౌట్ అయ్యాడంటూ అర్జున్ ఎదుట వ్యాఖ్యానించాడు. దీంతో, ఆగ్రహం పట్టలేకపోయిన అర్జున్ ఆ పిల్లావాడిని కొట్టాడు. తన తండ్రిని గురించి మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న సచిన్ వెంటనే అర్జున్ ను పిలిచి అనునయంగా మాట్లాడాడు. ఎవరైనా, ఏమన్నా అంటే పట్టించుకోరాదని హితబోధ చేశాడు. తాజాగా, జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాలు తెలిపాడు. అప్పట్లో అర్జున్ చేసింది తప్పేనని అన్నాడు. ప్రస్తుతం అర్జున్ దృష్టంతా క్రికెట్ పైనే ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News