: పోలవరాన్ని అడ్డుకునేందుకు రఘువీరా, జగన్ కుట్ర పన్నుతున్నారు: దేవినేని ఉమా
పోలవరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో పూర్తిచేస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో పలు ప్రాజెక్టుల్లో రఘువీరా బంధువుల అవినీతిని బయటపెట్టినందుకే పోలవరంపై రఘువీరా వ్యాఖ్యలు చేస్తున్నారని ఉమా విమర్శించారు. జిల్లాలోని శ్రీరామరెడ్డి ప్రాజెక్టులో రూ.77 కోట్ల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విభాగం వెల్లడించిందని తెలిపారు. దీని వెనుక రఘువీరా హస్తం ఉందని ఆరోపించారు. ఇక, జగన్ ఢిల్లీ వెళ్లి కేసుల నుంచి తప్పించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వేడుకోలేదా? అని ఉమా ప్రశ్నించారు.