: తిండి దొంగను చూసి నివ్వెరపోయిన మహిళ!
అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో విచిటా నగరంలో ఓ మహిళ (52) తన ఇంట్లో తిండి దొంగను చూసి నివ్వెరపోయింది. వివరాల్లోకెళితే... 28 ఏళ్ల యువకుడు వెనుక ద్వారం నుంచి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఫ్రిజ్ లోంచి కుకీ మిక్స్ ను తీసుకుని తినసాగాడు. వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో, కిచెన్ లో ఏదో శబ్దం వస్తుండడంతో ఆమెకు నిద్రాభంగమైంది. వెళ్లి చూస్తే, మనవాడు బిజీగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తాను ప్రవేశించింది తన ఆంటీ నివాసం అని భావించానని అతడు పోలీసులతో చెప్పాడట.