: టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య కన్నుమూత
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన సిద్దాంతి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి కన్నుమూశారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా శనివారం హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన మృతికి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జేసీ శర్మ, ఈవో గోపాల్ తదితర అధికారులు సంతాపం తెలిపారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా రేలంగిలో ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. తంగిరాలకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తంగిరాల వంశీకులు 13 తరాలుగా టీటీడీ పంచాంగ రూపకర్తలుగా సేవలందిస్తున్నారు.