: బుర్ద్వాన్ పేలుడు ప్రధాన నిందితుడు అరెస్ట్
బుర్ద్వాన్ పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన సాజిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన సాజిద్ ను కోల్ కతా ఎయిర్ పోర్ట్ సమీపంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రర్ స్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీలైనంత త్వరలో సాజిద్ ను ఎన్ఐఏకి అప్పగించనున్నారు.