: బెంగళూరులో త్వరలో నీటి ఏటీఎంలు!
ఏటీఎంకు వెళితే డబ్బులు తీసుకుంటాం. కానీ, ఈ ఏటీఎంలు తాగేందుకు నీళ్లు ఇస్తాయి. అలాంటి వినూత్నమైన పది ఏటీఎంలను తొలి దశలో భాగంగా త్వరలో బెంగళూరు నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఐదు రూపాయలకు 20 లీటర్ల నీటిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. గణనీయంగా భూగర్భజలాలు క్షీణించడం, పలు కారణాల నేపథ్యంలో ప్రజలకు నీటి కొరత తీర్చేందుకు ఈ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బెంగళూరు గ్రామీణ ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.