: స్వచ్ఛ భారత్ లో మరుగుదొడ్లను శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల


ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా మరో అడుగు ముందుకేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్వచ్ఛ భారత్ లో పాలుపంచుకున్న వారంతా రోడ్లను ఊడ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, చింతల మాత్రం వారికి భిన్నంగా మరుగుదొడ్ల పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఫిల్మ్ నగర్ లో చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లను ఆయన శుభ్రం చేశారు. దాదాపు గంటపాటు అక్కడి మూత్రశాలలను కడిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News