: అస్సీఘాట్ స్వచ్ఛ భారత్ లో మోదీ!
వారణాసి పర్యటనలో భాగంగా రెండో రోజైన శనివారం ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ లో పాల్గొన్నారు. వారణాసిలోని అస్సీఘాట్ లో పారబట్టి గంగానదీ పూడికను తీశారు. అంతకుముందు ఘాట్ లో జరిగిన నిర్మల్ గంగా పూజలో మోదీ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎప్పటిలాగే తొమ్మిది మందిని ఆహ్వానిస్తూ వస్తున్న మోదీ, ఈ దఫా తొమ్మిది మందిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేరును కూడా ప్రకటించారు.