: సోమనాథ్ ఆలయానికి 51 కేజీల బంగారం...అజ్ఞాత భక్తుడి భారీ కానుక!
గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయానికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకను బహూకరించాడు. తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని సదరు భక్తుడు, రెండేళ్ల వ్యవధిలో విడతలవారీగా మొత్తం 51 కిలోల బంగారాన్ని ఆలయానికి అందజేశారు. తాజాగా అరకేజీ బంగారంతో చేసిన గాజులు, కంఠాభరణాలను ఆ భక్తుడు అందజేశారని ఆలయ ట్రస్ట్ కమిటీ వెల్లడించింది. వైద్యుడిగా పనిచేస్తున్న సదరు భక్తుడు ముంబైలో ఉంటాడని మాత్రమే తెలుసని, ఇతర వివరాలను వెల్లడించేందుకు అతడు ఇష్టపడటం లేదని ట్రస్ట్ తెలిపింది.