: దత్తాత్రేయకు మోదీ ఫోన్!
కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మరోమారు కేంద్ర మంత్రి పదవి చేపట్టనున్నారు. రేపు జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు బెర్తు దాదాపుగా ఖరారైంది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దత్తాత్రేయకు ఫోన్ కాల్ వచ్చింది. ఆదివారం అందుబాటులో ఉండాలని దత్తన్నకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో దత్తన్నకు మరోమారు మంత్రి పదవి దక్కడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి ఎవరు కేంద్ర మంత్రి పదవికి ఎంపికవుతారన్న విషయం ఇంకా తేలలేదు.