: కిక్కు తలకెక్కిన మహిళ హోంగార్డుపై దాడి చేసింది!
హైదరాబాదు నగరంలోని ఉప్పల్ కూడలి వద్ద ఓ మహిళ మద్యం మత్తులో హోంగార్డుపై దాడికి దిగింది. వివరాల్లోకెళితే... ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, అటుగా పురుషోత్తం, విజయ అనే వ్యక్తులు కారులో వచ్చారు. నో పార్కింగ్ స్థలంలో కారు నిలపడంతో ఓ హోంగార్డు వారి కారును ఫొటో తీశాడు. అప్పటికే మద్యం కిక్కు తలకెక్కిన విజయ ఫొటో తీసిన హోంగార్డుపై దాడి చేసింది. అక్కడున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షించగా ఆమె మద్యం సేవించినట్టు స్పష్టమైంది. దీంతో, విజయ, పురుషోత్తంలపై కేసు నమోదు చేశారు. విజయది ఈస్ట్ మారేడ్ పల్లి కాగా, పురుషోత్తం అంబర్ పేటకు చెందినవాడు.