: రేపు ఆర్థిక మంత్రి జైట్లీని కలవనున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. హస్తినలో ఆయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. హుదూద్ తుపాను బాధితులకు ప్రధాని ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని జైట్లీని కోరనున్నారు. పార్టీ ఎంపీలు కూడా జగన్ వెంట ఢిల్లీ వెళ్లనున్నారు.