: స్పీకర్ కోడెల ఎయిరిండియా సిబ్బందితో గొడవ పడ్డారా?
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం నాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కగా, ప్రయాణం సందర్భంగా వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో కోడెల పక్కన కూర్చున్న ఆయన పరిచయస్తుడిని అతనికి కేటాయించిన సీట్లోనే కూర్చోవాలని ఎయిరిండియా సిబ్బంది సూచించారు. దీంతో, కోడెల విమాన సిబ్బందిపై ఆగ్రహించారట. తొలుత ఆ వ్యక్తిని తనతో పాటు కూర్చునేందుకు విమాన సిబ్బందే అనుమతించారని, ఆ తర్వాత వచ్చి, అతడిని వెళ్లిపొమ్మన్నారన్నది కోడెల కథనం. దీన్ని అవమానకరంగా భావించిన ఆయన ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారట.