: చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం... ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లాలో ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. పిచ్చాటూరు మండలం రామగిరిలో రోడ్డుపై నిల్చున్న నలుగురు వ్యక్తులపైకి కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.