: బడ్గమ్ కాల్పులకు మాదే బాధ్యత: ఆర్మీ
జమ్మూ కాశ్మీర్ లోని బడ్గమ్ లో జరిగిన కాల్పులకు తమదే బాధ్యతని భారత సైన్యం ప్రకటించింది. ఆ ఘటన చోటు చేసుకోవడం సైన్యం పొరపాటని జీవోసీ ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డి.హుడా తెలిపారు. ఈ ఘటనపై సరైన, పారదర్శక విచారణ జరిపేందుకు ఆర్మీ కట్టుబడి ఉందని చెప్పారు. విచారణలో పోలీసులకు ఆర్మీ పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఏదైనా ఉల్లంఘన ఉంటే ఖచ్చితంగా ఎదుర్కొంటామని వివరించారు. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా ఆర్మీ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని హుడా హామీ ఇచ్చారు. నాలుగు రోజుల కిందట బడ్గమ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్థానికులు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని హుడా ప్రకటించారు.