: కేంద్రమంత్రినైతే చేపల కూర మిస్సవుతానేమో!: గోవా సీఎం


గోవా సీఎం మనోహర్ పారికర్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి పదవి దాదాపు ఖాయమైన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను కేంద్రమంత్రినైతే గోవా స్పెషల్ చేపల కూరను మిస్సవుతానేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా వెళితే మీరు ఏం కోల్పోతారని మీడియా అడిగిన ప్రశ్నకు నవ్వుతూ బదులిస్తూ ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. రోజులో 16 నుంచి 18 గంటలపాటు కష్టించే తనకు గోవా సంస్కృతి అలవడలేదని అన్నారు.

  • Loading...

More Telugu News