: ప్రభుత్వ వసతుల్లో ఉంటున్న వ్యక్తుల సమాచారం ఇవ్వండి: కేంద్రానికి సుప్రీం ఆదేశం
ప్రభుత్వం కల్పించే వసతుల్లో ఉంటున్న వ్యక్తుల సమాచారం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తాజాగా కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాక ఢిల్లీలో ఎన్ని రకాల బంగాళాలు ఉన్నాయి, విచక్షణ కోటా కింద వాటిని ఎవరెవరికి కేటాయించారు, అదనంగా ఎన్నింటిలో ఎవరుంటున్నారన్న వివరాలన్నింటినీ తమకు ఇవ్వాలని కోర్టు అడిగింది. ఈ నెల 21కల్లా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ 2011లో చనిపోయినప్పటికీ, ఆయన భార్య అప్పటి నుంచి కూడా ప్రభుత్వ బంగ్లాలోనే ఉంటున్న విషయాన్ని లేవనెత్తిన న్యాయస్థానం, 2016 వరకు ఆ బంగ్లాలో ఉండే అనుమతి ఆమెకు ఉన్నట్లు పేర్కొంది.