: మనోహర్ పారికర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర కేబినెట్ లో రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్ వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోవాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అతనసియో మోసెర్రట్టె పార్టీకి రాజీనామా చేసి, పారికర్ సీటు పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. "పనాజీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ప్రకటించినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. అక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన" అని ఎమ్మెల్యే తెలిపారు.