: మైనర్ బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు: సాయ్


మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పందించింది. మైనర్ బాక్సర్లకు కూడా ప్రెగ్నెన్సీ టెస్టులు చేపట్టారన్న వార్తలు నిరాధారమని పేర్కొంది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్న భారత జట్టులో 18 ఏళ్ల లోపు బాక్సర్లెవరూ లేరని సాయ్ స్పష్టం చేసింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు కనీస వయసే 19 ఏళ్లు అయినప్పుడు, జట్టులో మైనర్లెలా ఉంటారని సాయ్ డైరక్టర్ జనరల్ జిజి థామ్సన్ ప్రశ్నించారు. వరల్డ్ ఈవెంట్ లో పాల్గొనాలంటే ప్రెగ్నెన్సీ టెస్టు తప్పనిసరి అని ప్రపంచ బాక్సింగ్ సంఘం నిబంధన విధించడంతో భారత బాక్సింగ్ సంఘం మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. దానిపై వివరణ ఇస్తూ, జట్టులో మైనర్లెవరూ లేరని థామ్సన్ స్పష్టం చేశారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకున్నామని తెలిపారు. వరల్డ్ క్లాస్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలంటే మహిళా బాక్సర్లు 'నో ప్రెగ్నెన్సీ' సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి.

  • Loading...

More Telugu News