: మీ సేవకుడిలా పనిచేస్తా: వారణాసి ప్రజలతో మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ, తన సొంత నియోజకవర్గంలో జరుపుతున్న తొలి పర్యటనలో భాగంగా భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం మోదీ వారణాసికి వచ్చారు. ఈ సందర్భంగా చేనేత వాణిజ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. "వారణాసికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. లోక్ సభ బరిలో నిలిచిన నన్ను గెలిపించి మీ సొంతం చేసుకున్నారు. మీ సేవకుడిగా పనిచేసేందుకు వచ్చాను. కష్టసుఖాల్లో మీ వెంట ఉంటా" అని మోదీ భావోద్వేగంతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News