: జమ్మూ కాశ్మీర్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్


జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నియోజకవర్గాల్లో డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. "జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సూచన మేరకు పద్దెనిమిది చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నాం. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సిఫారసుతో సెక్షన్ 27లోని సబ్ సెక్షన్ (2)కు లోబడి ఎన్నికలు నిర్వహిస్తున్నాం" అని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాగా, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 చివరి గడువు.

  • Loading...

More Telugu News