: టీడీపీ ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటోంది: హరీష్ రావు
శాసనసభ సమావేశాలను తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని టీఎస్ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించడం టీడీపీకి ఇష్టం లేదని... అందుకే సభా కార్యక్రమాలు సజావుగా కొనసాగకుండా అడ్డుకుంటోందని అన్నారు. ఏ సమస్యపైన అయినా, ఎంత సేపు అయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని... ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పష్టం చేశారని చెప్పారు. సభలో గందరగోళం సృష్టించి, సస్పెండ్ అయి బయటకు వెళ్లాలనే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. సభను అడ్డుకునే వారిని ప్రజలు హర్షించరని అన్నారు.