: శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని దంపతులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని శ్రీలంక ప్రధానమంత్రి జయరత్నే దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనం ప్రారంభం సమయంలో స్వామి వారి సేవలో ప్రధాని దంపతులు పాల్గొన్నారు. మహాద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించిన జయరత్నే శ్రీవారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. తరువాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను ప్రధానికి అందజేశారు. అంతకుముందు వారికి టీటీడీ అధికారులు ఆలయం లోపలికి స్వాగతం పలికారు.