: పేరుకే ప్రజాస్వామ్యం... ఉన్నదంతా ధనస్వామ్యమే: ఆర్.కృష్ణయ్య


దేశంలోని రాజకీయ స్థితిగతులు, చట్టసభలకు ఎన్నికవుతున్న సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో పేరుకే ప్రజాస్వామ్యముందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వాస్తవానికి ధనస్వామ్యం రాజ్యమేలుతోందని ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన కుమ్మర సంఘం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు ఎన్నికవుతున్న వారిపై కృష్ణయ్య మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు లంగలు, దొంగలు, భూకబ్జాదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎన్నికవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటిదాకా అధికారం చేపట్టిన అన్ని పార్టీలు బీసీలను భిక్షగాళ్లనే చేశాయని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News