: మహిళల రక్షణకు కేసీఆర్ భారీ ప్రణాళికలు!
తెలంగాణలో మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భారీ ప్రణాళికలకు తెర తీశారు. మహిళా రక్షక్ పేరిట కొత్త వ్యవస్థను రూపొందించేందుకు ఆయన వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని గురువారం నాటి మహిళా భద్రత సమీక్షలో కేసీఆర్ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పోకిరీలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. ఈవ్ టీజర్ల ఫొటోలు, వేలి ముద్రలను సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆపదలో చిక్కుకున్న మహిళలకు భరోసా కల్పించేందుకు 181 నెంబరుతో రౌండ్ ద క్లాక్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తోంది. ఇదిలా ఉంటే, మహిళలకు సగం రాయితీతో వాహన సౌకర్యం కల్పించేందుకు కేసీఆర్ నిర్ణయించారు.