: లంకపై టీమిండియా రెండో విజయం... రాయుడి తొలి శతకం!
తెలుగు తేజం అంబటి రాయుడు వన్డే ఫార్మాట్ లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో చెలరేగిన రాయుడు టీమిండియాకు వరుస విజయాన్ని అందించడంతో పాటు వన్డే చరిత్రలో తన సెంచరీని నమోదు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 118 బంతులను ఎదుర్కొన్న రాయుడు 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు రాబట్టాడు. అంబటి రాయుడు జూలు విదల్చడంతో టీమిండియా శ్రీలంకపై వరుసగా రెండో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించి సిరీస్ లో 2-0 ఆధిక్యం సాధించింది. వన్డేలతో పాటు టీ20, టెస్టుల్లోనూ తనదైన శైలితో రాణిస్తున్న రాయుడు గురువారం మాత్రం టీమిండియాకు తాను విలువైన ఆటగాడినేనని నిరూపించుకున్నాడు. తన ఆల్ టైం హై ప్రతిభతో జట్టులోనూ తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడు.