: చెలరేగిన అంబటి రాయుడు... తొలి సెంచరీ నమోదు


శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రమోషన్ మీద వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన రాయుడు... తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 101 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో వన్డే కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మరోవైపు రాయుడుకు తోడుగా కోహ్లీ 31 (27 బంతులు) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 38 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు. అంతకు ముందు శిఖర్ ధావన్ 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News