: కొత్త బాధ్యతలు స్వీకరించమని అమిత్ షా కోరారు: పారికర్
ప్రధాని మోడీ ఇస్తున్న కొత్త బాధ్యతలను స్వీకరించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. దీంతో, కేబినెట్ విస్తరణలో పారికర్ కు బెర్త్ ఖాయమైందన్న విషయం స్పష్టమవుతోంది. అయితే, రక్షణ శాఖనే కట్టబెడతారా? లేక మరేదైనా కట్టబెడతారా? అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. గోవా ఎమ్మెల్యేలు, బీజేపీ ఆఫీస్ బేరర్లతో చర్చించిన తర్వాత కేంద్ర మంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటానని పారికర్ చెప్పారు.