: తొలి వికెట్ కోల్పోయిన ఇండియా... స్కోరు 20/1


శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేలో సెంచరీ సాధించిన ఓపెనర్ రహానే 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసాద్ బౌలింగ్ లో జయవర్ధనేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 22 పరుగులు. ధావన్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా... అంబటి రాయుడు (2) వన్ డౌన్ లో బరిలోకి దిగాడు.

  • Loading...

More Telugu News